Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 08:53 AM

కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి:  కార్మిక సంఘాల నేతల పిలుపు

కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి:  కార్మిక సంఘాల నేతల పిలుపు

కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి:  కార్మిక సంఘాల నేతల పిలుపు
February 12, 2026 05:01 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

సుభాష్ విగ్రహం నుండి పెదగడియారం వరకు నిరసన ర్యాలీ అనంతరం సభ : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించుకోవాలంటే ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు పిలుపునిచ్చారు.

గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా సి ఐ టీ యూ, ఎఐటియుసి, ఐ ఎన్ టి యు, సి బి ఆర్ టి యు, ఐ ఎఫ్ టి యు దేశం లో అన్ని ట్రేడ్ యూనియన్స్, జాతీయ ఫెడరేషన్, ఈఒక్కరోజు రోజు సమ్మెచేయాలని పిలుపును ఇచ్చాయి అందులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు ప్రదర్శన అనంతరం సభ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలనీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు 100 సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చిన 29 చుట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చారని అవి కార్మికులకు, రైతులకు, ప్రజలను నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పని గంటలు 8గంటలు కాకుండా పనిగంటలు పెంచుతూ, వేతనాలు అడిగే హక్కు లేకుండా కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు ఉపాధి హామీ చట్టం రద్దు ద్వారా గ్రామీణ పేదల ఉక్కు పాదం మోపే విధంగా వి బి జీ  రాం జీ, విద్యుత్ సవరణ , రైతులకు నష్టం కలిగించు విత్తన సవరణచట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, తక్కువ వేతనాలతో ఎక్కువ పనులు చేయించుకునే విదంగా, పని ప్రదేశాలలో ఎటువంటి హక్కులు అడగకుండా చేసి, ప్రతి ఘటన లేకుండా చేయడం,కార్మికులకు, రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు కార్మికులకు హక్కులు లేకుండా చేసే ఈ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో కార్మికులను, రైతులను, ప్రజలను అందరినీ ఐక్యం చేసిపోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస నేత మాట్లాడుతూ కార్మికులు హక్కుల రక్షణ కోసం జరుగుతున్న పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల విధానాలను అమలు చేస్తూ కార్మికులను బానిసలుగా చేస్తుందని ఆరోపించారు పోరాటాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొనిమద్దతు తెలుపుతామని ప్రకటించారు

          సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన సభలోతెలంగాణ ప్రజా ఫ్రంట్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు ఆర్ ఆచారి దొనకొండ వెంకటేశ్వర్,లు అవుట రవీందర్, బొంగురాల నరసింహ, పాణ్యం వెంకట్రావు, చింతకాయల సంతోష్, పరిపూర్ణాచారి, పందిరి శ్యాంసుందర్, ఎన్ ఆర్ సి రాజు కందుల నరసింహ, నందం మారయ్య, గంజి నాగరాజు, వెంకన్,న కత్తుల యాదయ్య ,పెరిక కృష్ణ, సాగర్ల మల్లయ్,య భీమనపల్లి శంకర్, బోడ ఇస్తారి, గుండె రవి, రేవెల్లి యాదయ్య పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News