Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:42 AM

కర్ల రాజేష్ లాకప్ డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

21-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల డిమాండ్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరంమునగాల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగుడిపాటి కనకయ్య మాదిగమునగాల:మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన పత్రిక మిత్రుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ మాట్లాడుతూ.కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ చిలుకూరు మండల పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురై కస్టోడియల్ డెత్ కి గురి కావడం జరిగింది.ఇట్టి కేసులో A1 గా ఉన్న చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి ని మాత్రం కాపాడుకొని ఎస్పీ ఆఫీసు అటాచ్ చేసి, కోదాడ సిఐ ప్రతాప లింగమును బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది,నవంబర్ 16 న మరణించిన కర్ల రాజేష్ నేటికీ రెండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఎస్ఐ ని సస్పెండ్ చేయకపోవడం, వీరికి సూర్యాపేట జిల్లా డిఎస్పి,ఎస్పి సపోర్ట్ అందిస్తున్నారు, వీరందరికీ కూడా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, అలాగే సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అండదండలతోనే నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తక్షణమే మౌనం వీడకపోతే, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తు, హెచ్చరిస్తున్నాం.పోలీసు వారు కూడా ఒకరిని కాపాడుకోవడం కోసం ఇంకొకరు, తప్పులు మీద తప్పులు చేస్తూ, పోలీసు వ్యవస్థ మీద గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా తయారవుతున్నారు,కావున పోలీసు వారు కూడా ఇట్టి విషయంలో నిజాయితీగా పనిచేసి.వ్యవస్థ పై,చట్టాలపై గౌరవం పెరిగే విధంగా ఉండాలని, కర్ల రాజేష్ కస్టోడియల్ డెత్ కారకులైన వారి అందరిపై మర్డర్ కేసు, అట్రాసిటీ కేసు, నమోదు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈకార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల మాజీ ఉపాధ్యక్షులు మొలుగూరి వెంకటేశ్వర్లు, లంజపల్లి వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు.

Sthanikam

కర్ల రాజేష్ లాకప్ డెత్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News