Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:07 AM

కొనుగోలు కేంద్రాల్లోనే తూకం తరుగు పేరుతో వేధిస్తే చర్యలు తప్పవు..

కొనుగోలు కేంద్రాల్లోనే తూకం తరుగు పేరుతో వేధిస్తే చర్యలు తప్పవు..

కొనుగోలు కేంద్రాల్లోనే తూకం తరుగు పేరుతో వేధిస్తే చర్యలు తప్పవు..
April 18, 2026 06:17 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ధాన్యం సేకరణలో మిల్లర్ల పెత్తనం సాగనివ్వం..

రైతు నేరుగా మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి..


నల్గొండ : ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ జరగాలని ఇందులో మిల్లర్ల జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్. కోదండరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యపు రాశులను పరిశీలించి తేమ శాతం, తాలు, తరుగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రైతులు, హమాలీలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఇందుకు సంబంధిత శాఖల అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన తర్వాత రైతు మిల్లుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం పంపిన తర్వాత జరిగే ప్రక్రియ అంతా అధికారుల బాధ్యతేనని కోదండరెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు పక్కా రశీదు ఇచ్చి సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాకు 45 రూపాయలు మాత్రమే హమాలీ చార్జీలు వసూలు చేయాలని అంతకు మించి ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం తేమ, తాలు వంటివి కాంటా వేయకముందే కేంద్రంలోనే చూసుకోవాలని తరుగు పేరుతో రైతులను వేధించడం భావ్యం కాదని పేర్కొన్నారు. మిల్లర్లకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోవాలి తప్ప రైతుపై పెత్తనం చేస్తామంటే కుదరదని పాత పద్ధతులు ఇకపై చెల్లవని తేల్చి చెప్పారు. తమ సొంత ఖర్చులతో ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చే రైతులకు శాస్త్రీయంగా మద్దతు ధర అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ మిల్లుల వద్ద లారీలను నిలిపివేస్తూ తరుగు పేరిట క్వింటాళ్ల కొద్దీ ధాన్యాన్ని మిల్లర్లు కోత విధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మెంబర్, సెక్రటరీ గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల సంస్థ డీఎం రాంపతి నాయక్, తహసీల్దార్ పరశురాం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News