Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ సారాంపల్లి మల్లారెడ్డి కి ఘననివాళులు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 06:11 PM

కంపచెట్లతో అడవిని తలపిస్తున్న వైకుంఠ ధామం..

03-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

స్మశానవాటికనా మత్తుబాబులకు అడ్డా నా.!

భయం గుప్పిట్లో స్థానికులు, కాలని వసూలు..

పట్టించుకోని నల్గొండ కార్పొరేషన్ అధికారులు..

నల్గొండ : అంతిమ యాత్రకు వెళ్లే వేళ.. ఆత్మీయులకు వీడ్కోలు పలికే చోట కనీస గౌరవం కరువైంది. నల్గొండ పురపాలక సంఘం 19వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ స్మశానవాటిక నేడు అధ్వాన స్థితికి చేరింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో వైకుంఠధామం కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్మశానవాటిక అంతటా పిచ్చిమొక్కలు, ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిపోయాయి. చూస్తుంటే ఇది స్మశానమా లేక దట్టమైన అడవి అన్న అనుమానం కలగక మానదు.

కంపచెట్ల పొదల మధ్య పాములు, తేళ్లు వంటివి సంచరిస్తుండటంతో స్థానికులు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. పందుల స్వైర విహారం మరో ఎత్తు అంత్యక్రియల కోసం వచ్చే ప్రజలు ఈ కంపచెట్ల మధ్య నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు.

గంజాయి, మత్తు బాబులకు నిలయం..

​ఈ వైకుంఠ దామానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉండటం అసాంఘిక శక్తులకు వరంగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కొందరు యువకులు ఇక్కడ గంజాయి సేవిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. చీకటి పడితే ఈ ప్రాంతం మత్తుబాబుల గుప్పిట్లోకి వెళ్తోంది. ఈ అరాచకాలపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని ఇక్కడి పరిస్థితి చూసి అటువైపు వెళ్లడానికే భయపడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరుపయోగంగా మౌలిక వసతులు..

​లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మౌలిక వసతులు నేడు వృథాగా మారాయి. టాయిలెట్లు, బాత్రూమ్‌లు పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. తలుపులు విరిగిపోయి అపరిశుభ్రతతో నిండి ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో కనీసం లైట్లు కూడా వెలగకపోవడంతో చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక పనులు పెచ్చుమీరుతున్నాయని చనిపోయిన వారికి ప్రశాంతంగా వీడ్కోలు పలికే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ముళ్ల కంపల మధ్య అంత్యక్రియలు చేయడం ప్రాణసంకటంగా మారింది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలి. నిరంతరం నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి ఈ శ్మశానవాటికకు మహర్దశ కల్పించాలని భద్రతా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, శ్రీనగర్ కాలనీ నివాసితులు కోరుతున్నారు.

Sthanikam

కంపచెట్లతో అడవిని తలపిస్తున్న వైకుంఠ ధామం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News