Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం

07-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ప్రాంతంలోని కామినేని ఆసుపత్రి నుంచి ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన టంగుటూరి ఎల్లయ్య (60)ను ఆరోగ్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులను సంప్రదించేలోపే ఎల్లయ్య మతిస్థిమితం సరిగా లేక ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

తర్వాత ఎంత వెతికినా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎల్లయ్య కూతురు మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి మాట్లాడుతూ వృద్ధుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా ఎల్లయ్య కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Sthanikam

కామినేని ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News