కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే మళ్లీ కరువు రోజులు జగదీష్‌రెడ్డి..
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే మళ్లీ కరువు రోజులు జగదీష్‌రెడ్డి..
NM Yadav
15 రోజుల్లో ఖాళీ కానున్న రిజర్వాయర్లు..
హైదరాబాద్, నల్గొండకు తీవ్ర తాగునీటి ముప్పు..
కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లివ్వడం సాధ్యమే ఆధారాలతో నిరూపిస్తా ఇరిగేషన్ మంత్రికి సవాల్..
విద్యుత్ వైఫల్యం, ఎరువుల కొరతతో రైతాంగం అల్లాకల్లోలం ఉత్తమ్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి..
నల్గొండ : కాంగ్రెస్ ప్రభుత్వ ఆపరిపక్వత, నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రంలో మళ్లీ 2014 పూర్వపు దుర్భిక్ష పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువును ఎదుర్కోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అసలు పాలనపై చిత్తశుద్ధే లేదని మండిపడ్డారు. సోమవారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
15 రోజుల్లో రిజర్వాయర్లు ఖాళీ!
"మరో 15 రోజుల్లో రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీళ్లన్నీ పూర్తయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు గోదావరి జలాలు సముద్రం పాలువుతుంటే వాటిని ఒడిసిపట్టుకునే తెలివి లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎంతటి తీవ్ర కరువు వచ్చినప్పటికీ నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చివరి పావు వరకు పంటలకు నీరందించి రైతులకు అండగా నిలిచాం. కానీ నేడు మిషన్ భగీరథ నీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ పాలకులు ఉన్నారు. అందుబాటులో ఉన్న వ్యవస్థలను వాడుకునే కనీస అవగాహన రేవంత్‌రెడ్డికి లేదు అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.
ఆంధ్రకు నీళ్ల దోపిడీ పాలకుల్లో లేని సోయి..
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని, రోజుకు కనీసం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. "ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన ప్రాజెక్టుల కోసం నాగార్జునసాగర్ నుంచి యథేచ్ఛగా 50 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే ఈ పాలకుల్లో కనీసం సోయి లేదు. ఫలితంగా నల్గొండతో పాటు రాజధాని హైదరాబాద్‌కు త్వరలోనే తీవ్ర మంచినీటి ఎద్దడి రాబోతోంది. ముందే అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం కాలయాపన చేసి, తీరా నష్టం జరిగాక జిల్లా రివ్యూలంటూ డ్రామాలాడుతోంది. ఇంకుడు గుంతలు, పంపాడ్‌లు తవ్వాలంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌కు దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి..
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఉత్తమ్‌కు విషయ పరిజ్ఞానం లేదు. ఆయన మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలే. ఉత్తమ్‌కు నిజాయితీ, దమ్ముంటే ఆయన వాడిన ల్యాప్‌టాప్ సిస్టమ్‌ను నాకు అప్పగించాలి. కాళేశ్వరం గొప్పదనం ఏంటో, దాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఆధారాలతో సహా నిరూపించి ఆయన కళ్లు తెరిపిస్తా. కన్నెపల్లి పంపులను ఇప్పటికిప్పుడు ఆన్ చేసి ఎస్సారెస్పీ సహా అంతటా నీళ్లు ఇవ్వొచ్చని నిరూపించేందుకు సిద్ధం" అని సవాల్ విసిరారు.
కాళేశ్వరం బ్యారేజీలు బ్రహ్మాండంగా ఉన్నాయి..
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టడానికి రేవంత్, ఉత్తమ్ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. "సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్డీఎస్ఏ (NDSA) కూడా బ్యారేజీలు దెబ్బతిన్నాయని చెప్పలేదు. కేవలం కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే కాళేశ్వరాన్ని పడావు పెట్టి, రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. బసవపూర్ వరకు కూడా నీళ్లు ఇచ్చి చూపిస్తాం.. కన్నెపల్లి రిజర్వాయర్‌ను మాకు అప్పజెప్తే నీళ్లిచ్చి తీరుతాం. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 150 టీఎంసీల ప్రాణహిత నీటిని సముద్రం పాలు చేసింది" అని మండిపడ్డారు.
రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పేరును ‘అబద్ధాల రెడ్డి’గా మార్చుకుంటే బాగుంటుందని జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విఫలమైన ఉత్తమ్‌రెడ్డి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి