కమలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల నిర్వహించగా నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోకుల మధన్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా మిరియాల గణేశ్వర్ రావు (గణేష్), అయ్యవారి పుష్పాంజలి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తుమ్మల సుబ్బారావు, జాయింట్ సెక్రటరీగా తౌటం సంగ్రామ్, బోయిని లక్ష్మి (అర్చన) ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జక్కిడి సునీతా రెడ్డి, దంతూరి వెంకటేష్ గౌడ్ ఎన్నిక కాగా, కోశాధికారిగా చౌదరి దివాకర్ లింగం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను కాలనీవాసులు అభినందించారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు గోకుల మధన్ రెడ్డి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి