Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:18 PM

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి: బీజేపీ మండిపాటు

18-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మహిళా సాధికారతకు అడ్డంకి

​* చౌటుప్పల్‌లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

​* అడ్డుకున్న పోలీసులు - బీజేపీ శ్రేణుల నిరసన

మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం అడ్డంకిగా నిలుస్తోందని బీజేపీ మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.​ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. మహిళలకు సామాజిక న్యాయం చేయడంలో గానీ, వారికి సమాన హక్కులు కల్పించడంలో గానీ ఆ పార్టీకి ఎన్నడూ నిజమైన సంకల్పం లేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని అన్నారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ నిరసనను అడ్డుకోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలే చిరంజీవి, బుడ్డ సురేష్, యాస అశోక్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, పాలకుర్ల జంగయ్య గౌడ్, ఉబ్బు బుచ్చయ్య, గోష్క నీరజ, బర్మా నాగరాణి, కడెం భాగ్యమ్మ, బోడిగే పద్మ, కట్ట కృష్ణ, దిండు భాస్కర్, లగోని పాండు, కొయ్యాడ స్వామి గౌడ్, ఓరకంటి భాను, అమృత, దశరథ, మధు, లింగస్వామి, బతరాజు వెంకటేష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి: బీజేపీ మండిపాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News