Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026.. రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:41 PM

కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల గర్జన లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్..

01-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో కార్మిక సంఘాల భారీ నిరసన.. ‘బ్లాక్ డే’గా పాటింపు

నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నాలుగు నూతన లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై జరుగుతున్న తీవ్రమైన దాడి అని ఇవి చట్టాల మార్పు కాదని కార్మిక హక్కుల అపహరణేనని ఐక్య కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తారు. జాతీయ పిలుపులో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బొల్గురి నరసింహ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త కోడ్లు కార్మికుల శ్రమను చౌకగా మార్చి కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే రూపొందించిన దోపిడీ విధానాలని విమర్శించారు. పని గంటలను పెంచడం వల్ల కార్మికుల ఆరోగ్యం, జీవన నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 300 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థల్లో ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారాన్ని యాజమాన్యాలకు కట్టబెట్టడం వల్ల ఉద్యోగ భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతుందని వారు హెచ్చరించారు. కార్మిక సంఘాల ఏర్పాటు సమ్మె చేసే హక్కులపై పరిమితులు విధించడం అంటే కార్మికుల గొంతు నొక్కడమేనని మండిపడ్డారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ కార్మికులను అస్థిరమైన జీవితంలోకి నెట్టేస్తున్నారని, కనీస వేతనాలు, బోనస్, సామాజిక భద్రత వంటి హక్కులను ఈ కోడ్లు బలహీనపరుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన గౌరవప్రదమైన వేతనాలు అందించాలని కాంట్రాక్ట్ వ్యవస్థను తగ్గించి పర్మినెంట్ ఉద్యోగాలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి సలీం, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దొనకొండ వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్, నాయకులు దండేపల్లి సత్తయ్య, అవుట రవి, ఎం. నందం, సంబి రెడ్డి, యూసుఫ్, నాగరాజు, నరసింహ, సీతరాములు, శంకర్, ఇందూరి సాగర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాల గర్జన లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News