Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ

04-03-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచిలో మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు

కూసుమంచి మండలంలో మామిడి తోటలు ప్రస్తుతం జొన్న గింజ–బటాని గింజ దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మార్చి నెలలో వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగులు అధికమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నల్ల మచ్చ తెగులు లక్షణాలు కనిపించినట్లయితే కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్డిజం + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగు ఉధృతి ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

పిందెలు అధికంగా రాలుతున్నట్లయితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీని 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. మందుల మోతాదులను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైతే సమీప ఉద్యాన కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.

Sthanikam

జొన్న గింజ – బటాని గింజ దశలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యాన అధికారి పి. అపర్ణ

Article Image

కూసుమంచిలో మామిడి పంటకు సస్యరక్షణ చర్యలు

కూసుమంచి మండలంలో మామిడి తోటలు ప్రస్తుతం జొన్న గింజ–బటాని గింజ దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణ తెలిపారు. మార్చి నెలలో వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు, పురుగులు అధికమయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నల్ల మచ్చ తెగులు లక్షణాలు కనిపించినట్లయితే కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి లేదా కార్బన్డిజం + మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తేనె మంచు పురుగు ఉధృతి ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

పిందెలు అధికంగా రాలుతున్నట్లయితే ప్లానోఫిక్స్ 4.5 మి.లీని 25 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. మందుల మోతాదులను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైతే సమీప ఉద్యాన కార్యాలయాన్ని సంప్రదించాలని రైతులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News