Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

04-03-2026 670 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆసరా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేస్తున్న అధికారుల తీరుపై పద్మశాలీ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా నేత సమాచార హక్కు చట్టం–2005 సెక్షన్ 6(1) కింద రామన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

జియోట్యాగ్ నెంబర్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిని అందించాలని ఎంపీడీవో కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస రెడ్డిని కోరారు. జియోట్యాగ్ లేకపోవడంతో 50 సంవత్సరాలు దాటిన పలువురు పద్మశాలీలు ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మగ్గం నేసే ఒకరికి మాత్రమే జియోట్యాగ్ నెంబర్ ఇచ్చి, ఒక హెల్పర్‌కు అవకాశం కల్పించగా, మిగతా చేనేత కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. అర్హతను గ్రామ కార్యదర్శులు లేదా చేనేత సహకార సంఘాల ద్వారా ధ్రువీకరించి, నిజమైన చేనేత కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, పట్టణ అధ్యక్షుడు దిండిగల రాములు, నాయకులు రాపోలు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జియోట్యాగ్ పేరుతో పద్మశాలీలకు పెన్షన్ నిరాకరణా? జీవో కాపీ ఇవ్వాలని ఆర్టిఐ కింద వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News