సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలి - ముత్యాల పిచ్చయ్య
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు అని ముత్యాల పిచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన ఈ పండుగలు ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. భోగి పండుగతో పాత కష్టాలు, బాధలను విడిచిపెట్టి కొత్త ఆశలతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, సంక్రాంతి పండుగ రైతులకు మంచి పంటలు, ప్రజలకు శ్రేయస్సు అందించాలని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి