Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:10 AM

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య
20-07-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఒక వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పరిధిలోని చిన్న కొండూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నానంచర్ల పెంటయ్య (72) (తండ్రి: వీరయ్య) గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనారోగ్య బాధలు భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కొడుకు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News