శ్రీ సత్యసాయి జిల్లా తురకలపట్నం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి బి.చేతన్ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. గత సంవత్సరం నవంబర్‌లో పులివెందులలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నాడు.
ఏప్రిల్ 15 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో చేతన్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంగప్ప, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. చేతన్ జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ప్రతిభ చూపాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి