జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Prabhakar
కన్నుల పండుగ కాప్రా ప్రెస్ క్లబ్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం
సంక్షేమం కోసం కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్ కమ్యూనిటీ హాల్లో కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు నిరంతరం అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలని సూచించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ జర్నలిస్టులతో ఉద్యమ కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
చర్లపల్లి మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి మాట్లాడుతూ జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వార్తలు రాయాలని సూచించారు. జర్నలిస్టులకు కష్టసుఖాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాప్రా మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి మాట్లాడుతూ జర్నలిస్టులు గత దశాబ్దకాలంగా తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం కల్పించి తన ఉన్నతికి ఎంతో దోహదం చేశారని ప్రశంసించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి కాప్రా జర్నలిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి, టీటీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరుగొండ సతీష్ బాబు, బిజెపి డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్యారెడ్డి, చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్, బిజెపి సీనియర్ నాయకులు అంబటి వెంకటాచలం, కనుకుల రజనీకాంత్ రెడ్డి, జీవీఎన్ రావు, సుడుగు మహేందర్ రెడ్డి, బిజెపి హెచ్.బి కాలనీ డివిజన్ అధ్యక్షుడు రామ్ ప్రదీప్, సంపత్ రావు, రేగొండ వెంకులు, బిఆర్ఎస్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి, మురళి పంతులు, బిఆర్ఎస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్, బిఆర్ఎస్ హెచ్ బి కాలనీ డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే, బిఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకురాలు షేర్ మణమ్మ, బిఆర్ఎస్ నాయకులు గోగికర్ శివకుమార్, ఎస్ఎ. రహీం, రేగళ్ల సతీష్ రెడ్డి, శివసేన రాష్ట్ర కార్యదర్శి పూస శ్రీనివాస్, బిజెపి నాయకులు సుర్వి శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. శివానంద్, బిఆర్ఎస్ నాయకులు సుంకర సుశీల్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గంప కృష్ణ గుప్తా, రేబెల్లి శ్రీనివాస్ గుప్తా, తిరుమల నగర్ కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మహాత్మా గాంధీనగర్ కాలనీ అధ్యక్షులు బుడంపల్లి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మాజీ పారా మిలిటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుర సైదయ్య గౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
భవాని నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో....
భవాని నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. చిరంజీవి, కోశాధికారి సిహెచ్ వి. రామరాజు, ఉపాధ్యక్షులు బివి పుల్లారావు, కె. హనుమయ్య, సంయుక్త కార్యదర్శులు ఎన్. సదాలక్ష్మి, టి శ్రీనివాస్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్. అశోక్ రెడ్డి, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ జి వెంకట్ రెడ్డి, సలహాదారులు వి. శేఖర్, వి. శ్రీరాములు, బి. శ్రీనివాస్ గుప్తా, ఎన్.జి. బాల గంగాధర్ రావు, పి. శివప్రసాద్, ఎన్. సురేందర్, కాలనీ నాయకులు మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు గున్నా రాజేందర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి యానాల ప్రభాకర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. మధు, సుభాష్ చంద్రబోస్, ప్రభాకర్ తదితరులు హాజరై ప్రెస్ క్లబ్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఘనంగా పదవీ ప్రమాణ స్వీకారం
కాప్రా ప్రెస్ క్లబ్ కార్యవర్గంతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు ఏంపల్లి పద్మారెడ్డి, బెలిదే అశోక్, అధ్యక్షులుగా మెరుగు చంద్రమోహన్, ఉపాధ్యక్షులుగా యావాపురం రవి, దొమ్మాటి కిరణ్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్ రావు, గోవిందుకుంట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముఖేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శిగా డి. శ్రీనివాస్, కె. వెంకట్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఓ. నరసింహ, కీర్తి శ్రీనివాస్, కోశాధికారి రామచంద్రమూర్తి, కార్యవర్గ సభ్యులుగా గంగి కృష్ణ, బుడంపల్లి నిరంత్ గౌడ్, తొడుపునూరు బాలకృష్ణ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పటేల్ నరసింహ, యాట రాజు, వెంకటాపురం రవి, రామకృష్ణ, శ్రీహరి, రవి యాదవ్, వాసు, ఎండి. రియాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి