Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:57 AM

జనం పెల్లి బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

జనం పెల్లి బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

జనం పెల్లి బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
March 11, 2026 06:55 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ శాఖ అధ్యక్షుడిగా నక్క నరేందర్ ఎంపిక

రామన్నపేట మండలంలోని జనం పెల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నూతన గ్రామ కమిటీ పార్టీ బలోపేతానికి హర్నిశలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.

అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా నక్క నరేందర్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా బీరం రాజిరెడ్డి, గట్టు రాములు, ప్రధాన కార్యదర్శిగా సంఘీ ఐలయ్య, కార్యదర్శిగా ఎర్రబోయిన సత్తయ్య, కోశాధికారిగా గట్టు శేఖర్, ఉపకోశాధికారిగా మల్లెబోయిన కృష్ణలను ఎన్నుకున్నారు. అలాగే అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీ వేమవరం సుధీర్ బాబు, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, మాజీ సర్పంచ్ కోళ్ల స్వామి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ ఉపేందర్ రెడ్డి, నాయకులు కోళ్ల కిషన్, జనం పెల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు సభ్యులు నక్క రాణి, రాములు, నల్ల సైదులు, రైతు విభాగం అధ్యక్షుడు చొప్పరి లింగయ్య, యువజన విభాగం అధ్యక్షుడు సంగిశెట్టి శివాజీ, సోషల్ మీడియా అధ్యక్షుడు వంగాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News