Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:35 AM

జనవరి ఇరవై నాలుగున చలో కోదాడకు వేలాదిగా తరలిరండి

20-01-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ పిలుపు

మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్

కోదాడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి, పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ ఆరోపించారు. ఈ అన్యాయాలను నిరసిస్తూ జనవరి ఇరవై నాలుగున నిర్వహించనున్న చలో కోదాడ కార్యక్రమానికి మునగాల మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళవారం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ పోలీస్ రాజ్యం, లాఠీ రాజ్యం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్‌పై అక్రమంగా కేసులు నమోదు చేసి, కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్సైలు పథకం ప్రకారం చిత్రహింసలకు గురి చేయడంతో అతడు అనారోగ్యానికి గురై మరణించాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని, అధికార పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు.

గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకత్వంపై జరిగిన దాడులు ఇందుకు నిదర్శనమని తెలిపారు. మునగాల మండలంలో నారాయణగూడెం దళితులపై, తిమ్మారెడ్డిగూడెం, మాధవరం గ్రామాలలో జరిగిన దాడుల పరంపర నేటికీ కొనసాగుతోందని విమర్శించారు.

ఈ దాడులను ఖండిస్తూ బిఆర్ఎస్ పార్టీ చలో కోదాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కావున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలను ముక్తకంఠంతో ఖండించాలని తొగరు రమేష్ కోరారు.

Sthanikam

జనవరి ఇరవై నాలుగున చలో కోదాడకు వేలాదిగా తరలిరండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News