Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

జన్మదిన వేడుకల్లో గ్రామానికి నీటి శుద్ధి యంత్రం బహుమతి. ఎడ్ల మహేందర్ రెడ్డి

06-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటా : ఎడ్ల మహేందర్ రెడ్డి

వెల్లంకిలో వాటర్ ఫిల్టర్, కూలర్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం, శీతలీకరణ యంత్రాన్ని (వాటర్ ఫిల్టర్, వాటర్ కూలర్) గురువారం ప్రారంభించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఏర్పాట్లు చేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.65 వేలతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్, కూలర్‌ను ఎడ్ల మహేందర్ రెడ్డి–శిల్ప దంపతుల చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎడ్ల మహేందర్ రెడ్డి పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారని కొనియాడారు.

అనంతరం మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అదే సందర్భంగా బీఆర్ఎస్ యువ నాయకుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎడ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సహాయం అందిస్తానని తెలిపారు. సేవ చేయడానికి పదవులు అవసరం లేదని అన్నారు.

సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజకుమార్, వార్డు సభ్యులు నరేష్, శాంతి, లింగయ్య, మల్లమ్మ, జగన్, భాగ్యలక్ష్మి, ఉమా, బీఆర్ఎస్ నాయకులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, యువ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి, ఇడెం శ్రీనివాస్, తలారి నరసింహ, పాశం సతీష్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

జన్మదిన వేడుకల్లో గ్రామానికి నీటి శుద్ధి యంత్రం బహుమతి. ఎడ్ల మహేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News