Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

17-04-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: జనగణన 2027లో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత పిలుపునిచ్చారు.

పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

స్వీయ నమోదు ప్రక్రియలో అందించే వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోబడవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ పోర్టల్ https://se.census.gov.in లేదా మొబైల్ హౌస్ లిస్టింగ్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ముందుగానే నమోదు చేసుకోవడం ద్వారా గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజల సమయం ఆదా అవుతుందని చెప్పారు. జనగణనలో ఇచ్చే సమాచారం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రభావం చూపదని, కాబట్టి భయపడకుండా సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.

జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ 15 రోజుల స్వీయ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకుని జనగణనలో పాల్గొనాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. “జనగణనలో పాల్గొందాం… సమాజ అభివృద్ధికి తోడ్పడదాం” అని ఆమె అన్నారు.

Sthanikam

జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News