Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీపీఎం రాజకీయ శిక్షణతోనే పార్టీ బలోపేతం! రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 02:45 AM

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..

జిల్లా కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ రాక..
April 02, 2026 05:53 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఘన స్వాగతం పలికిన మంత్రి కోమటిరెడ్డి, అధికారులు..

నల్లగొండ : త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నల్లగొండకు చేరుకున్న ఆయనకు స్థానిక రోడ్లు, భవనాల అతిథి గృహం (R&B Guest House) వద్ద ఘన స్వాగతం లభించింది. అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.

అనంతరం జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డిలు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ను కలిసిన వారిలో నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొద్దిసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం గవర్నర్ తన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News