Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 09:15 PM

జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి..

జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి..

జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి..
05-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల..

నల్గొండ : దేశాభివృద్ధిలో బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు మరియు ఎన్జీ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్ రామ్ పడిన తపన ఆదర్శనీయమని కొనియాడారు. ముఖ్యంగా నేటి యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని కోరారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వారితో పాటుగా కౌన్సిలర్లు దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్, పెరిక యాదయ్య, పేర్ల మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, నాయకులు బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, పెరిక కరణ్, జయరాజ్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, బిపంగి యాదయ్య, సింగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News