Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 29, 2026 12:46 AM

జబర్దస్త్ జోకర్ కిరాక్ అర్పి నోరు అదుపులో పెట్టుకో అని విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ మాస్ వార్నింగ్.

జబర్దస్త్ జోకర్ కిరాక్ అర్పి నోరు అదుపులో పెట్టుకో అని విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ మాస్ వార్నింగ్.

జబర్దస్త్ జోకర్ కిరాక్ అర్పి నోరు అదుపులో పెట్టుకో అని విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ మాస్ వార్నింగ్.
February 17, 2026 12:59 AM 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

వంగర, పిబ్రవరి 17:బొత్సా స్థాయిని తగ్గించడం అంటే కిర్రాక్ అర్పి తన తల ఎత్తి సూర్యుడు పై ఉమ్మి వేయడం లాంటిదని అని సురేష్ ముఖర్జీ ఎద్దేవా చేశారు.


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం తోపాటు భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతీ ఒక్కరకీ కల్పించింది.అయితే అది ఏ రంగంలో అయినా ఒక వ్యక్తి మరో వ్యక్తిని కించపరిచేలా,అవమాన పరిచేలా ఉండకూడదు. మాట్లాడటానికి ఒక పరిది అంటూ ఉంటుంది.ఆంద్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాష్ట్ర శాశనసభ సమావేశాల్లో భాగంగా శాసన మండలి ప్రతిపక్ష నాయకులు (మాజీ మంత్రి) బొత్సా సత్యనారాయణ మాట్లాడిన విధానాన్ని జబర్దస్త్ షోలో కామెడీ చేసుకొనే జోకర్ కిర్రాక్ అర్పి సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా మాట్లాడుతూ బొత్స అబిమానుల మనో బావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో ఆ విషయాన్ని బొత్సా అబిమానిగా జిల్లా అధికార ప్రతినిధి ఎంపీపీ యూ సురేష్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు.కిర్రాక్ ఆర్పి అక్షరాలు దిద్దక మునుపే తన ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఉన్నత శిఖరాలుకి ఎదిగిన నాయకుడు బొత్సా సత్యనారాయణ అని సురేష్ ముఖర్జీ అన్నారు.బొత్సాని వ్యంగ్యంగా అనుకరించి ఆయన స్థాయిని ఏదో తక్కవ చేసేద్దాం అని అనుకుంటే తల ఎత్తి సూర్యుడుపై ఉమ్మి వేయడం లాంటిదని కిర్రాక్ అర్పి తెలుసు కోవాలని సురేష్ ముఖర్జీ ఎద్ధేవా చేసారు.ఉత్తరాంద్రలో సాంప్రదాయ రాజకీయాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు బొత్సా అని అన్నారు.రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని అధికారం ఎప్పుడూ ఏ ఒక్కరి చేతుల్లో ఉండదని,ఈరోజు నీదైతే రేపు మాది అనే విషయం మరవకూడదు అని అన్నారు.రాజకీయ కక్షలకు, గొడవలకు దూరంగా ఉండే నాయకత్వం బొత్సా సత్యనారాయణది అని అలాంటి మా నాయకుడుని తప్పుడుగా ఎవరైనా సరే మాట్లాడినా వ్యంగ పదజాలంతో అవమానం పరిచినా ఆయన అభిమానిగా నేను సహించబోనని సురేష్ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.బొత్సా సత్యనారాయణ అసెంబ్లీకి వస్తే భూటకపు హామీలు,ఆంద్ర ప్రదేశ్ అదిక అప్పులు బాగోతం,కుటుంబ సభ్యులుకు అప్పలంగా 99 పైసల కు అప్పగించిన భూ భాబోతోం,రెడ్ బుక్ రాజ్యాంగంలో అన్యాయంగా బలైన వారి విషయాలు ఎక్కడ ఎత్తి చూపుతారెమో అని భయపడి ఇటువంటి కమెడీయన్ తో కామెడీ లకు తెర లేపారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలన అందించకపోగా ఇలాంటి జబర్దస్త్ షో జోకర్ లతో లేనిపోని డైవర్సన్ పాలిటిక్స్ తో ప్రజల ఆలోచనలను దారి మళ్ళిద్దాం అనుకుంటే అది ఆస్యాస్పదం అని,ఆంద్ర ప్రజలు అన్ని గమినిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో నీ వెనుక ఉండి నడిపించే వారికి తమదైన రీతిలో ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు.ఇక మీదట మా నాయకుడుపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తే మేము సోషల్ మీడియా వేదికగా ఎండగట్టి ఎదుర్కొని గట్టిగా బుద్ది చెబుతామని సురేష్ ముఖర్జీ హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News