Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 04:22 AM

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రభంజనం.
April 12, 2026 07:11 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఫస్ట్ ఇయర్ లో వరుస స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు.

ఇంగ్లీష్ లో 100 కు 100 మార్కులు సాధించిన విద్యార్థి

సెకండ్ ఇయర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ.

ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫస్ట్ ఇయర్ లో వరుసగా 468, 467, 466, 465 మార్కులు సాధించి మార్కులు సాధించి వరుస స్టేట్ ర్యాంకులు సాధించారు. కాలేజ్ కు చెందిన వేముల వెంకట విశాల్ 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. 467 మార్కులతో డి. చరిష్మా, ఎస్. విమల లు స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. వైష్ణవి 466, అంజనీ 465 లు మార్కులు సాధించారు. బై పీ సీ విభాగంలో వీరు 432 మార్కులు సాధించాడు. సెకండ్ ఇయర్ లో అమృత సుధా వర్షిణి 988, లక్కం రక్షిత 987, ఎరబోలు శరణ్య 986 మార్కులు సాధించారు.

ఇంగ్లీష్ పేపర్ లో 100 మార్కులు సాధించిన విద్యార్థి....

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో కాలేజ్ కి చెందిన ఎస్. విమల 100కు 100 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా ఇంగ్లీష్ పేపర్ లో 100 కు 100 మార్కులు సాధించడం తమ కాలేజ్ కు గర్వకారణమని ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. ఈ ఫలితాల మాదిరిగానే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలలో జాతీయ స్థాయి ర్యాంకు లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ , పీ ఆర్ వో మల్లికార్జున రావులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News