Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్
05-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపడుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ యుద్ధోన్మాద చర్యలను ప్రపంచ ప్రజలంతా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని హరినాథ్ తెలిపారు. నిరపరాధులపై జరుగుతున్న దాడులు మానవత్వానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చర్యలను ప్రశ్నించకపోవడం బాధాకరమని విమర్శించారు. గతంలో ఇరాక్‌పై తప్పుడు ఆరోపణలు చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన ఘటనను గుర్తుచేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలు తక్షణం యుద్ధాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, శాంతి నెలకొనాలని హరినాథ్ కోరారు.

Sthanikam

ఇరాన్‌పై దాడులను ఖండించాలి డి హరినాథ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News