Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

ఇళ్లలో బంగారంపై మోదీ దృష్టి.. 32 వేల టన్నుల ‘గోల్డ్ రిజర్వ్’ను ఆర్థిక శక్తిగా మలచే యత్నం!

02-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశంలోని ఇళ్లలో, ఆలయాల్లో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీపిలుపునిచ్చారు. బంగారం రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా విదేశాల నుంచి బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, విలువైన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం సుమారు 30,000 నుంచి 32,000 టన్నుల మేర బంగారం ఇళ్లలో, దేవాలయాల్లో, ప్రైవేట్ నిల్వల రూపంలో ఉందని అంచనా. ఈ భారీ నిల్వలో కేవలం ఒక శాతం బంగారాన్ని మాత్రమే రీసైక్లింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినా, బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం దిగుమతులు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇప్పటికే ఉన్న బంగారాన్ని ఆర్థిక వనరుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రధాని పిలుపును జ్యువెలరీ సంఘాలు, బంగారం వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గోల్డ్ రీసైక్లింగ్‌కు ప్రోత్సాహం లభిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రజలు తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని బ్యాంకులు, గోల్డ్ డిపాజిట్ పథకాల ద్వారా వ్యవస్థలోకి తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు బలం చేకూరే అవకాశం ఉంది. బంగారం కేవలం ఆభరణంగా కాకుండా ఆర్థిక ఆస్తిగా మారితే దిగుమతి భారం తగ్గడంతో పాటు దేశ విదేశీ మారక నిల్వల పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వారు పేర్కొంటున్నారు.‘ఇంట్లోని బంగారం.. దేశ ఆర్థికాభివృద్ధికి బంగారు బాట’ అనే సందేశంతో కేంద్రం గోల్డ్ రీసైక్లింగ్‌కు మరింత ఊతమివ్వనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Sthanikam

ఇళ్లలో బంగారంపై మోదీ దృష్టి.. 32 వేల టన్నుల ‘గోల్డ్ రిజర్వ్’ను ఆర్థిక శక్తిగా మలచే యత్నం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News