Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

06-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయో, వాటిలో ఎన్ని ఇండ్లు పూర్తయ్యాయో, మిగిలినవి ఏ దశలో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచి నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తైన దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయా అని కూడా ఆరా తీశారు.

వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తే చివరి బిల్లు కూడా విడుదల అవుతుందని, లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News