Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

05-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

కోదాడలో ‘శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్’ ప్రారంభం

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోదాడ పట్టణంలో మరో స్వయం ఉపాధి కేంద్రం ప్రారంభించారు. కోదాడ పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ బజార్లో శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఏ. రమాదేవి లు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.పట్టణంలో ప్రారంభమైన శ్రీనిధి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. మహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని నాయకులు సూచించారు.ఇలాంటి వ్యాపారాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు సమాజంలో తమ స్థానం మరింత బలపరుచుకుంటారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూడో వాడు కౌన్సిలర్ వంగూరీ గోపి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సుల్తానీ సుజాత రాంబాబు, మెప్మా సీఓ వెంకన్న, సి ఎల్ ఆర్ పి రాణి, నిర్వాహరాలు బచ్చలకూర అనూష ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరా మహిళా శక్తి పథకానికి మరొక బలమైన అడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News