Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం
21-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆటల ద్వారా అభ్యాసం, నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశాలు (పిటిఎం), అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలను వివరించారు.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్‌లు అందించడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వారానికి మూడు గుడ్లు, మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావా అందిస్తున్నట్లు చెప్పారు.

“మన పిల్లలను సర్కార్ బడుల్లో చదివించుకుందాం.. సర్కార్ బడులను కాపాడుకుందాం” అని విద్యార్థులు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వరికుప్పల స్వామి, ప్రధానోపాధ్యాయులు కే.శేఖర్, ఉపాధ్యాయ బృందం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తవుటం బిక్షపతి, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, ఈరపల్లి మల్లయ్య, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం లో బడి బాట కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News