Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

ఇంద్రపాలనగరం అభివృద్ధి ఎప్పుడెప్పుడు...?

19-04-2026 288 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెరువు తూములు శిధిలం.

ప్రాణాలకు ముప్పు తక్షణ మరమ్మతులు చేయాలి.సిపిఎం

చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, శిధిలావస్థకు చేరిన చెరువు తూములను వెంటనే మరమ్మత్తు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుయాత్రలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన ఆయన, స్థానిక సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… క్రీ.శ. ఆరవ శతాబ్దంలో విష్ణుకుండ్యుల రాజధానిగా వెలుగొందిన ఈ ప్రదేశం నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, అమలు మాత్రం జరగడం లేదన్నారు.

ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చినా కనీస సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని, ముఖ్యంగా తాగునీటి సదుపాయం కూడా లేకపోవడం తీవ్ర లోపమని పేర్కొన్నారు. పురాతన విగ్రహాలు, అవశేషాలు శిధిలమవుతూ గుర్తుతెలియని వ్యక్తుల తవ్వకాలతో నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ వెంటనే స్పందించి వాటిని పరిరక్షించడంతో పాటు పర్యాటకులకు అవసరమైన కాటేజీలు ఏర్పాటు చేస్తే గ్రామానికి ఆదాయం పెరుగుతుందని సూచించారు.

ఇక గ్రామంలోని చెరువు తూములు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని, ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ప్రధాన తోము దెబ్బతినడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహా, నాయకులు కొమ్మగోని అశోక్, భువనగిరి అశోక్, నాగు నర్సింహా, రాదారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం అభివృద్ధి ఎప్పుడెప్పుడు...?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News