Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా
18-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. “మోడీ జీ కో హటావో – దేశ్ కీ బచావో” నినాదాలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఛిబ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్సీ విప్ అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో డిలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.

అలాగే యూఎస్ ట్రేడ్ ఒప్పందాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. దేశ స్వాభిమానానికి విరుద్ధమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు.

ధర్నాకు వేలాదిగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు కే.ఆర్. భవ్య, రోష్ని జైస్వాల్, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News