Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:47 AM

హయత్‌నగర్‌లో ఘనంగా శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి మహోత్సవాలు

05-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

హయత్‌నగర్ పరిధిలోని ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి విగ్రహ వాహన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మే 4, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా బేతన బొట్ల కృష్ణ శర్మ వ్యవహరిస్తుండగా, తుర్కపల్లి సూర్య ప్రకాశ చారి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యక్షురాలిగా నూకల శాంత కుమారి, సహాయ కార్యదర్శిగా తుర్కపల్లి సదానంద చారి సేవలు అందిస్తున్నారు. కోశాధికారిగా జాటోత్ విజయ, కార్యవర్గ సభ్యులుగా తుర్కపల్లి మాధవి, అనిత కుమారి వ్యవహరిస్తున్నారు. కాలనీ అధ్యక్షులుగా శంభాల వెంకటేష్ ఈ మహోత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మహోత్సవాల సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన, మహా కుంభాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల హృదయాలను ఆనందింపజేస్తాయని తెలిపారు.

Sthanikam

హయత్‌నగర్‌లో ఘనంగా శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి మహోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News