Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:28 AM

హైవేల్లో డీజిల్ దొంగల ముఠా కట్టడి – నల్లగొండ పోలీసుల మెగా ఆపరేషన్

11-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలో హైవేలను వేదికగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక బృందాలు దాడి చేసి మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం.నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎం వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా మొత్తం విలువ రూ.40 లక్షలుగా అంచనా. గతంలో కూడా వీరిపై తెలుగు రాష్ట్రాల్లో 20కు పైగా కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది.డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్, చిట్యాల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి. డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో ట్యాంకుల నుంచి డీజిల్ దొంగిలించడం వీరి ప్రధాన విధానంగా పోలీసులు తెలిపారు.

హైవే ప్రయాణికులు అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే Dial-100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Sthanikam

హైవేల్లో డీజిల్ దొంగల ముఠా కట్టడి – నల్లగొండ పోలీసుల మెగా ఆపరేషన్

Article Image

నల్లగొండ జిల్లాలో హైవేలను వేదికగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక బృందాలు దాడి చేసి మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం.నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎం వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా మొత్తం విలువ రూ.40 లక్షలుగా అంచనా. గతంలో కూడా వీరిపై తెలుగు రాష్ట్రాల్లో 20కు పైగా కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది.డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్, చిట్యాల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి. డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో ట్యాంకుల నుంచి డీజిల్ దొంగిలించడం వీరి ప్రధాన విధానంగా పోలీసులు తెలిపారు.

హైవే ప్రయాణికులు అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే Dial-100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News