Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

గూడెం వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

04-03-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, 108 కళశాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం సుదర్శన హవనం భక్తి శ్రద్ధలతో సాగింది. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ సి హెచ్ వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి టి రావు మాట్లాడుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి హెచ్ అంజన్ రావు, సి హెచ్ రమాపతిరావు, బి రాజేశ్వరరావు, ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

గూడెం వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News