Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్

06-03-2026 325 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు అడగగా, వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువకులు రాడ్డు తీసుకుని స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచివారుకారుతోతప్పించుకున్నారని చెప్పారు.కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు, కారులో వచ్చిన యువకుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం స్థానికులతో కారులో వచ్చిన యువకుల హల్చల్

Article Image

చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తి పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు.ఈ సందర్భంగా కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు అడగగా, వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువకులు రాడ్డు తీసుకుని స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచివారుకారుతోతప్పించుకున్నారని చెప్పారు.కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు, కారులో వచ్చిన యువకుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News