Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి
30-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం కొంతమంది కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని, ఖమ్మంలో ఐటీడీఏను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, వైరా కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు.

జిల్లాలో భూసమస్యలు, ఉపాధి, విద్య సమస్యలను పరిష్కరించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

బోనకల్ మండలం రాయినూతల గ్రామంలో సాగు చేస్తున్న అసైన్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆందోళనకు తెలంగాణ జాగృతి నాయకుడు బానోత్ కిషన్ నాయక్ మద్దతు తెలిపారు. అనంతరం గిరిజన సంఘం నేతలు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Sthanikam

గిరిజనుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News