Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

ఘనంగా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణకు వీడ్కోలు. కలెక్టర్

31-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వెంకటరమణ సేవలను అభినందించారు. ప్రణాళికల రూపకల్పనలో ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. జనగణన–2027కు సంబంధించి అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన పాత్ర విశేషమన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో మరువలేని సేవలు అందించారని కొనియాడారు. జనగణన కార్యక్రమంలో నిబద్ధతతో పనిచేసిన విధానాన్ని అభినందించారు.

టి.జి.ఓ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ సహచరులతో సమన్వయం పాటిస్తూ సేవలందించారని పేర్కొన్నారు.

పదవీ విరమణ పొందిన వెంకటరమణ తన అనుభవాలను పంచుకుంటూ సహచరుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు కలిసి మెమెంటో, శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణకు వీడ్కోలు. కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News