ఆందోల్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీ
మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపాకటాక్షాలు అందాలని కోరుకున్నారు. అనంతరం చౌటుప్పల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దగోని ప్రసాద్ గౌడ్, తూర్పుంటి గణేష్, పల్చం శ్రీకాంత్ గౌడ్, చేవెళ్ళి సాయి, ఊదరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి