Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
07-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో మూడు రోజుల పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సమాన హక్కులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 45 శాతం మహిళలు ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అభద్రత భావాన్ని విడిచిపెట్టి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీజీవో యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షురాలు అంబిక, కార్యదర్శి చైతన్య, టీఎన్జీవో కార్యదర్శి ఖదీర్, ఖజాంచి శ్రీకాంత్, ట్రెసా అధ్యక్షుడు కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణతో పాటు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News