Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

15-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎలాంటి కొరత లేదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి స్పష్టం చేశారు. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పెట్రో ఉత్పత్తుల రవాణాపై ప్రభావం ఉన్నా, దేశంలో అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందని, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడం, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అడ్డుకోవడం, నిల్వలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే ఏజెన్సీలపై జీవో–5, బీఎన్‌ఎస్ 6ఏ, 7, 1955 చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించాలని, బుకింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్వో వనజతరెడ్డి, డీఎంహెచ్‌వో లలితాదేవి, డీటీసీ సదానందం, ఎమ్మార్వో వేణుగోపాల్ తదితర అధికారులు, గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు.

Sthanikam

గ్యాస్ సరఫరాపై అపోహలు తొలగింపు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News