Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:15 AM

గ్యాస్ కొరత లేదు… అపోహలు నమ్మొద్దు తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్యాస్ కొరత లేదు… అపోహలు నమ్మొద్దు తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్యాస్ కొరత లేదు… అపోహలు నమ్మొద్దు తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
March 13, 2026 04:47 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైలెవల్ కమిటీ ఏర్పాటు • 288 కేసులు నమోదు

అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించి గందరగోళానికి గురిచేసే తప్పుడు ప్రచారాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎల్‌పీజీ సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగా కృత్రిమంగా గ్యాస్ కొరత ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సుమారు 2.5 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని, మొత్తం కోటి 29 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 810 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సరఫరా జరుగుతోందని, ఇప్పటివరకు బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా కొరత నమోదు కాలేదన్నారు.

అపోహలను అడ్డుపెట్టుకుని గ్యాస్ నిల్వలు దాచడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై ఇప్పటివరకు 288 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిల్వలు, సరఫరా పరిస్థితిని రోజువారీగా సమీక్షించాలని సూచించారు.

గ్యాస్ వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీలు, నిల్వ కోసం తగిన స్థలం సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులు గందరగోళానికి గురికావద్దని, బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజా రాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్కెటింగ్ అధికారి సబితా, ఉద్యాన శాఖ అధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News