Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:27 PM

గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థులు

11-03-2026 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో యువ ఆపదమిత్ర శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్కాణం అభినందించారు. ఈ సందర్భంగా సురేష్, మహేష్, చంద్రశేఖర్, సాయి, సమీర్, రేష్మ, భవాని, ఆసియా, భావన, మౌనిక తదితర విద్యార్థులతో పాటు బీహార్ రాష్ట్రంలోని ససారంలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్న సాయి తేజను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ తరఫున విద్యార్థులకు నాయకత్వం వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి తాటిశెట్టి శ్రీనివాసులను కూడా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన యువ ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాలకు చెందిన పదిమంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోవడం గర్వకారణమన్నారు. పది రోజులపాటు జరిగిన ఈ శిక్షణలో వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, సునామీలు, రోడ్డు ప్రమాదాల వంటి విపత్తుల సమయంలో బాధితులను రక్షించడం, వారికి ప్రథమ చికిత్స అందించడం, హార్ట్‌అటాక్ వచ్చిన వారికి సీపీఆర్ చేయడం, నీటిలో పడిన వారిని రక్షించడం, భవన శిథిలాలలో చిక్కుకున్న వారిని ర్యాఫ్లింగ్ (అసెండింగ్, డిసెండింగ్) పద్ధతుల ద్వారా కాపాడడం వంటి అంశాలపై ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వర్ రావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం. అనిత, డాక్టర్ కిషన్, డాక్టర్ రవీందర్ రావు, జి. నరేష్, ఏ. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News