Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్

30-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌సెటి) శిక్షణా కేంద్రాన్ని సోమవారం భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువత, మహిళలు శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆర్‌సెటి ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణలతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, శిక్షణ అనంతరం స్వయం ఉపాధి ప్రారంభించేందుకు బ్యాంకుల నుంచి సహకారం అందుతుందని తెలిపారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి మాట్లాడుతూ సెల్‌ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్, ప్లంబింగ్, టైలరింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వంటి కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌సెటి డైరెక్టర్ కిషన్ భుక్య, డివిజనల్ మేనేజర్ పంకజ్, ఎల్‌డీఎం మాటూరి వంశీ, డీపీఎం శ్రీనివాస్, జేడీఎం రాజు, బ్యాంకు ప్రతినిధులు, శిక్షణార్థులు పాల్గొన్నారు..

Sthanikam

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News