Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:47 AM

గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇవ్వాలి

గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇవ్వాలి

గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇవ్వాలి
March 07, 2026 05:50 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా.. సర్కులర్ ప్రతుల దగ్ధం

రామన్నపేట మండలంలో గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలను నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం రామన్నపేట మండల గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల పంచాయతీ అధికారి రఫుఫ్ అలీకి వినతిపత్రం అందజేశారు. తర్వాత స్థానిక సుభాష్ సెంటర్‌లో ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నకిరేకంటి రాము మాట్లాడుతూ గత సంవత్సరం సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గ్రామపంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నెలల తరబడి పనిచేసినా జీతాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి, ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల వివరాలను నమోదు చేసి జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగె సోములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందేల భిక్షం, మేడి రామచంద్రం, మంచాల రేణుక, నల్ల సుగుణమ్మ, మంటే నాగరాజు, మంటి అంజయ్య, పుట్ట నాగరాజు, ఉక్కుర్తి లచ్చమ్మ, జయమ్మ, కొమ్ము కవిత, బల్గురు చందన, శంకరమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News