Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

గ్రామాల పరిశుభ్రతకు అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

06-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములై గ్రామాల పరిశుభ్రతకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేపల్లి గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలను గ్రామంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో చెత్త లేకుండా శుభ్రం చేయాలని, మురికి కాలువలు మరియు రోడ్ల ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలని, వాటర్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రం చేయాలని సూచించారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరి నెల కావడంతో ఇంటి పన్నుల వసూళ్లను పూర్తి చేసి క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాములు, ఎంపీడీవో, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల పరిశుభ్రతకు అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News