Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:10 PM

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం

06-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గర్భకోశ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ (Human Papilloma Virus) టీకాల కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రారంభిస్తున్నట్లు రామన్నపేట సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అశ్వినికుమార్ తెలిపారు. ఆదివారం సీహెచ్‌సీ రామన్నపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో కూడా టీకాలు అందించనున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు గర్భకోశ క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అర్హులైన బాలికలందరూ హెచ్‌పీవీ టీకా తీసుకోవాలని సూచించారు.

అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సాధారణ స్థితిలో ఉండేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.

Sthanikam

గర్భకోశ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News