Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 12:37 AM

గొల్లగూడ పీఏసీఎస్ చైర్మన్‌గా నాగరత్నం రాజు బాధ్యతల స్వీకారం..

04-05-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండ : నల్లగొండ పట్టణ పరిధిలోని గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన ఈ పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో అధికారులు, సిబ్బంది మరియు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం నాగరత్నం రాజు మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గొల్లగూడ పీఏసీఎస్ పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని, అలాగే సాగు పనులకు అవసరమైన రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సొసైటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గం మరియు సిబ్బందితో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Sthanikam

గొల్లగూడ పీఏసీఎస్ చైర్మన్‌గా నాగరత్నం రాజు బాధ్యతల స్వీకారం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News