సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
గాంధీనగర్ కొత్త కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాలనీవాసులను కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి