Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:18 AM

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో
03-03-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని స్వర్ణ గ్రామ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్వో చలమారెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డి వద్ద నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన మాధవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ను ఆశ్రయించాడు.

ఈ మేరకు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు వేశారు. గుడ్లూరు బస్టాండ్ సెంటర్‌లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Sthanikam

ఏసీబీ వలలో చిక్కిన విఆర్వో

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News