Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

02-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన గురువారం బ్యాంక్ కంట్రోలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26లో భాగంగా బ్యాంకుల ద్వారా అమలు చేయనున్న జిల్లా లక్ష్యాలకు ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి బ్యాంకుల నుంచి కాన్సెంట్ ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లు మరియు పాడి గేదెల పథకాలకు 30 శాతం బ్యాంకు లోన్ మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు.

దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మండలాలు, పథకాల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కాన్సెంట్ ఇవ్వడానికి బ్యాంక్ కంట్రోలర్లు అంగీకారం తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇంచార్జ్) వంశీతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు

Sthanikam

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్. లోన్ల మంజూరుకు కాన్సెంట్ తప్పనిసరి.. గడువు పొడిగింపు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అధ్యక్షతన గురువారం బ్యాంక్ కంట్రోలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26లో భాగంగా బ్యాంకుల ద్వారా అమలు చేయనున్న జిల్లా లక్ష్యాలకు ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనంతరం వారికి బ్యాంకుల నుంచి కాన్సెంట్ ఇవ్వడం తప్పనిసరి అని తెలిపారు. ఈ పథకాల అమలులో భాగంగా ఈవీ టూ వీలర్ యూనిట్లకు 10 శాతం, ఈవీ త్రీ వీలర్ యూనిట్లు మరియు పాడి గేదెల పథకాలకు 30 శాతం బ్యాంకు లోన్ మంజూరు చేయాల్సి ఉంటుందని వివరించారు.

దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మండలాలు, పథకాల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కాన్సెంట్ ఇవ్వడానికి బ్యాంక్ కంట్రోలర్లు అంగీకారం తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఇంచార్జ్) వంశీతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇతర బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News