Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికకు దరఖాస్తులు ఆహ్వానం

14-03-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

190 యూనిట్లకు రూ.3.82 కోట్లు – ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలకు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కోసం 2025–26 సంవత్సరానికి ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు జిల్లా పరిపాలన వెల్లడించింది. ఈ పథకం కింద 190 యూనిట్లకు రూ.3.82 కోట్లతో 190 కుటుంబాలకు బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.

పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలు 118 యూనిట్లు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు 60 యూనిట్లు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ మరియు వ్యవసాయ సంబంధిత పరికరాలు 12 యూనిట్లను అందించనున్నారు.

అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. రవాణా ఆధారిత పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. సోలార్ పంప్ పథకానికి కనీసం రెండు ఎకరాల భూమి, బోరుబావిలో నీరు ఉండాలి.

దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, ఫోటో తదితర పత్రాలు సమర్పించాలి. ద్విచక్ర వాహనాల పథకంలో జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఉబర్ వంటి సంస్థల్లో డెలివరీ లేదా రవాణా సేవలు అందించే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ పథకానికి ఆన్‌లైన్ ద్వారా మార్చి 17 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు OBMMS Portal ద్వారా నమోదు చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీవో కార్యాలయం లేదా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి.

పథకానికి సంబంధించిన అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు చివరి తేది. 24.03.2026 : దరఖాస్తును https://tgobmms.cgg.gov.in ఆన్లైన్ తేది 17.03.2026 నుండి 24.03.2026 లోపల నమోదు చేసుకోనవలెను. OBMMS లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంపీడీవో కార్యాలయములో / పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయములో అందజేయవలెను.

Sthanikam

ఎస్సీ కార్యాచరణ ప్రణాళికకు దరఖాస్తులు ఆహ్వానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News